విదేశీ జీవిత భాగస్వాములకు శుభవార్త
భారతీయులను పెళ్లి చేసుకున్న విదేశీ జీవిత భాగస్వాములకు శుభవార్త. భారత జాతీయత కలిగిన వ్యక్తి లేదా విదేశాల్లోని భారత పౌరసత్వం ఉన్న వ్యక్తికి చెందిన విదేశీ భాగస్వామికి కూడా ఇకనుంచి ఓసీఐ కార్డు లభిస్తుంది. ఇప్పటిదాకా ఇలాంటి విదేశీ సంతతి జీవితభాగస్వాములకు ఓసీఐ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లేదు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డుదారుకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి నిబంధనల్లో మార్పులు తెస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. అదేవిధంగా విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకుని, విదేశీ పౌరసత్వం పొందేందుకు కూడా నిబంధలను సరళతరం చేసింది.













