జమ్మూకశ్మీర్‌లో అమెరికా రాయబారి పర్యటన
జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ సహా భారత్ లోని 15 దేశాల రాయబారులు శ్రీనగర్ చేరుకున్నారు. కొందరు రాజకీయ నేతలు, సైన్యాధికారులు, పౌరసమాజ ప్రతినిధులు నుంచి వివరాలు తెల్సుకున్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం తెల్సిందే. బంగ్లాదేశ్, వియత్నాం, నార్వే, మాల్దీవ్స్, దక్షిణ కొరియా, మొరాకో, నైజీరియా తదితర దేశాల రాయబారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. వారితో పాటు విదేశాంగ శాఖ కార్యదర్శి వికాస్ స్వరూప్ వచ్చారు. వారికి లెఫ్ట్‌నెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ కశ్మీర్ పరిస్థితులను వివరించారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంపై విదేశీ రాయబారులకు జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జీసీ ముర్ము వివరణ ఇచ్చారు.













