అమెరికాలో ఘరో ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు
అమెరికాలో ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్ హైవేలో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. జాన్సన్ కౌంటీలో ఉన్న 67వ నంబరు హైవేపై మినీవ్యాన్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమలాపురం వాసులుగా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంపై తానా సభ్యులు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు. అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ సూచన మేరకు తానా ట్రెజరర్ అశోక్ కొల్లా, ఫౌండేషన్ ట్రెజరర్ పోలవరపు శ్రీకాంత్, ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.













