ఎకో హీరోలగా ఎంపికైన భారతీయులు
అంతర్జాతీయ యువ పర్యావరణ వేత్తల అవార్డు-2023కు ఐదుగురు భారతీయ యువతీ యువకులు ఎంపిక అయ్యారు. వీరిని ఎకో హీరోలని అంటారు. అమెరికాకి చెందిన యాక్షన్ఫర్ నేచర్ అనే సంస్థ వీరిని ఎంపికచేసింది. ఈహా దీక్షిత్ (మీరట్), మాన్యా హర్ష (బెంగళూరు), నిర్వాణ్ సోమానీ, మన్నత్ కౌర్ (ఢిల్లీ), కర్ణవ్ రస్తోగీ (ముంబాయి) పర్యావరణంపై యువతీ యువకుల్లో అవగాహన పెంచేందుకు ఈ సంస్థ పోటీ నిర్వహించింది. ఆ పోటీలో వీరు ఎంపిక అయ్యారు. వీరిని ఇండిపెండెంట్ ప్యానల్ ఎంపిక ఏచసింది. ఈ సంస్థ గడిచిన 20 సంవత్సరాల నుంచి 339 మందికి ఎకో హీరోలను 27 దేశాల నుంచి ఎంపిక చేసింది.













