జార్జియా అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన తెలుగు విద్యార్థులు
అమెరికాలోని జార్జియా లిండ్‌బర్గ్‌లోని అపార్టుమెంట్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 28 మంది తెలుగు విద్యార్థులు సర్వం కోల్పోయారు. విద్యార్హత ధ్రువపత్రాలు, పాస్‌పోర్టులు, పుస్తకాలు, వస్త్రాలు, జనన ధ్రువపత్రాలు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. జార్జియా స్టేట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు సమీపంలోని అపార్టుమెంటులో అద్దెకు ఉంటున్నారు. 80 ఫ్లాట్లున్న ఈ భవనంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం ఏర్పడింది. విద్యార్థులకు అన్ని ధ్రువపత్రాలను ఇప్పించేందుకు చర్యలు చేపట్టామని ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య సమన్వయకర్త కుమార్ అన్నవరపు తెలిపారు.













