Punadipadu: బాలుర హాస్టల్ కి ధన సహాయం…
పునాదిపాడు(Punadipadu) గ్రామ వాస్తవ్యులు విజయవాడ నివాసి నవజీవన్ బుక్ షాప్ అధినేత కీ.శే. పిడికిటి రామకోటేశ్వరావు గారి పెద్దల్లుడు, ప్రవాసాంధ్రులు, తానా మాజీ అధ్యక్షులైన శ్రీ కోమటి జయరాం(Komati Jayaram) గారు USA, రామ కోటేశ్వరరావు గారి రెండవ కుమార్తె శ్రీమతి కొడాలి కరుణ USA గార్లు 11.02.2025న బాలుర వసతి గృహం సందర్శించి రామకోటేశ్వరావు గారి జ్ఞాపకార్థం Rs.1,00,000/- (లక్ష రూపాయలు) వసతి గృహ అభివృద్ధి పనుల నిమిత్తం విరాళం అందజేసినారు.
ఈ సందర్భంగా వారు బాలురుతో మాట్లాడుతూ పలు సలహాలు, సూచనలు ఇస్తూ వారికి భరోసా కల్పించారు. వారి దాతృత్వానికి బాలురు కృతజ్ఞతలు తెలియజేసినారు.







