యూట్యూబ్ కార్యాలయం వద్ద కాల్పుల బీభత్సవం
యూట్యూబ్ ప్రధానా కార్యాలయంలో ఓ మహిళ అనూహ్యంగా కాల్పులకు తెగబడి బీభత్సం సృష్టించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కోలో యూట్యూబ్ ప్రధాన కార్యాలయం ఉంది. లంచ్ సమయంలో ఉద్యోగులు భోజనం చేస్తుండగా ఓ మహిళ డైనింగ్ కోర్టుయార్డు వైపు దూసుకొచ్చింది. కార్యాలయం లోపలికి వెళ్తూ వెళ్తూనే విచక్షణ రహితంగా కాల్పులు మొదలు పెట్టింది. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయింది.
ఈ ఘనటలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 27 ఏళ్ల ఓ బాధితురాలి పరిస్థితి స్థిరంగానే ఉన్నప్పటికీ, మరో ఇద్దరు మాత్రం మృత్యువుతో పోరాడుతున్నట్టు సమాచారం. కాగా ఈ ఘనటతో యూట్యూబ్ ప్రధానా కార్యాలయంలో పనిచేస్తున్న మొత్తం 1100 మందిని హుటాహుటిన బయటికి తరలించారు. కాల్పులకు పాల్పడిన మహిళను ఇంకా గుర్తించలేదు. ఇంట్లో గొడవల కారణంగానే ఆమె ఈ ఘతుకానికి దిగినట్లు భావిస్తున్నారు. ప్రియుడిని టార్గెట్ చేసి కాల్పులు జరిపే క్రమంలో ఈ దారుణం జరిగిందని అధికారులు చెప్పినట్టు శాన్ జోస్ మెర్క్యూరీ న్యూస్ వెల్లడించింది.













