భారతీయ అమెరికన్ మహిళలకు కాన్సులేట్ జనరల్ సత్కారం
వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న నలుగురు ప్రముఖ భారతీయ అమెరికన్ మహిళలకు ఇక్కడి భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్ (ఎఫ్ఐఏ) సత్కరించాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వారిని గౌరవించినట్లు ఎఫ్ఐఏ పేర్కొంది. విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతున్న మహారాణి రాధికారాజె గైక్వాడ్, న్యూజెర్సీకి తొలి భారతీయ మేయర్ నీనా సింగ్, ఆర్డబ్ల్యూజే బర్నబాస్ హెల్త్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాక్టర్ ఇందూ ల్యూ, గ్రామీణ భారతంలో మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్న దేశాయ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మేఘా దేశాయ్లను సన్మానించినట్లు ఎఫ్ఐఏ తెలిపింది.







