NATS: నాట్స్ తెలుగు సంబరాల్లో ఘనంగా ఫ్యాషన్ షో
టంపా వేదికగా జరిగిన నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల్లో ఫ్యాషన్ షో ఘనంగా జరిగింది. అందమైన మోడల్స్.. చూడచక్కని డిజైనర్ దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేసి అందర్నీ అలరించారు. అందమైన యువతులు, యువకులు అందరూ తమ డిజైనర్ దుస్తులను ప్రదర్శించారు. ఈ ఫ్యాషన్ షో చూసిన ప్రేక్షకులు.. మోడల్స్‌ను ప్రశంసించారు. నాట్స్ నిర్వాహకులు సదరు మోడల్స్‌ను అభినందించారు. ప్రేక్షకులు తమ కరతాళ ధ్వనులతో మోడల్స్ అందర్నీ మెచ్చుకున్నారు.







