TANA: తానా మహాసభల్లో అలరించిన ఫ్యాషన్ షో
డెట్రాయిట్ వేదికగా జరుగుతున్న 24వ తానా (TANA) మహాసభల్లో అద్భుతమైన ఫ్యాషన్ షో నిర్వహించారు. అందమైన భామలు అద్భుతమైన డ్రెస్‌లలో వచ్చి అందర్నీ అలరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందర్నీ యూత్ కాన్ఫరెన్స్ సభ్యులు నిఖిల్ విజయేంద్ర సింహ కొనియాడారు. అందమైన కాస్ట్యూమ్స్‌లో మోడల్స్ అందరూ అదరగొట్టారన్నారు. ఈ ఫ్యాషన్ షోను విజయవంతం చేయడానికి చాలా కష్టపడ్డారని మోడల్స్ అందర్నీ మెచ్చుకున్నారు. డిజైనర్‌ను ప్రత్యేకంగా అభినందించిన తానా.. రవి పొట్లూరి చేతుల మీదుగా వారిని సత్కరించింది.







