ఫేస్బుక్ మద్దతు నాకు కాదు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా, ఆ ఎన్నికలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌పై రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ గెలుపులో ఫేస్బుక్ కీలక పాత్ర పోషించిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన ట్రంప్, ఫేస్బుక్ మద్దతు తనకు లేదని హిల్లరీకే ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల కోసం నా కంటే హిల్లరీ మిలియన్ డాలర్లు ఎక్కువ ఖర్చు పెట్టారు. అంతేకాదు, ఫేస్బుక్ మద్దతిచ్చింది కూడా నాకు కాదు, హిల్లరీకే అని ట్రంప్ అన్నారు.













