కొత్త లోగోను ఆవిష్కరించిన ఫేస్బుక్
ఫేస్బుక్ గ్రూప్ తాజాగా తన లోగోను మార్చింది. తన అనుబంధ కంపెనీలు జతచేరిన అనంతరం జరిగిన మార్పును సూచిస్తూ ఈ లోగో ఉంది. ఫేస్బుక్ అనే వర్ణమాలను క్యాపిటల్ అక్షరాలుగా చేసి.. కొత్త ఫాంట్‌లోకి మార్చారు. నీలం, ఆకుపచ్చలతో పాటు వంగపండు రంగు, ఎరుపు, నారింజ రంగులతో కలగలిపిన రంగులతో కొత్త లోగో తీసుకొచ్చింది. తద్వారా ఇతర బ్రాండ్లనూ లోగోలో కనిపించజేశారు. (నీలం-ఫేస్బుక్, ఆకుపచ్చ-వాట్సప్, వంగపండు, ఎరుపు, నారింజ-ఇన్స్టాగ్రామ్). తనకు చెందిన యాప్స్‌ల విషయంలో వినియోగదారులకు మరింత సృష్టత నిచ్చేలా ఈ లోగోను తీర్చిదిద్దినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, వాట్సప్‌లు ఫేస్‌బుక్‌కు చెందినవని కేవలం 29 శాతం మంది అమెరికన్లు మాత్రమే గుర్తించినట్లు ఒక సర్వేలో తేలింది. అందుకే ప్రజలకు తమ కంపెనీ అందిస్తున్న ఉత్పత్తుల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఒక బ్లాక్ పోస్ట్‌లో ఫేస్బుక్లో రాసుకొచ్చింది.













