ఫేస్బుక్ లో కొత్త ఫీచర్లు
వినియోగదారుల ప్రొఫైల్ను లాక్ చేయడానికి అనుమతినిచ్చే కొత్త భద్రతా ఫీచర్ని భారతదేశంలో ప్రారంభిస్తున్నామని ఫేస్బుక్ ప్రకటించింది. మరింత నియంత్రణ కోరుకునే మహిళల కోసం దీన్ని రూపొందించామని ఫేస్బుక్ పబ్లిక్ పాలసీ, డైరెక్టర్, అంఖి దాస్ తెలియజేశారు. ఇండియాలో ప్రజలు ముఖ్యంగా మహిళలు తమ ఆన్ లైన్ ప్రొఫైల్ని కాపాడుకోవాలని అధికంగా ఆలోచిస్తుంటారని, వారి గోపత్యను నిర్థారిస్తూ, దానిని సురక్షితంగా ఉంచేందుకు ఈ ఫీచర్ ఉపకరిస్తుందని తెలిపారు. దీన్ని వాడితే, ఫుల్ సైజ్ ప్రొఫెల్ పిక్చర్ మరియు కవర్ ఫోటో జూమ్ చేయలేరు, షేర్ చేయలేరు, డౌన్ లోడ్ చేయలేరని, మీ టైంలైన్ లో (పాతవి మరియు కొత్తవి) ఫోటోలు మరియు పోస్టులను చూడలేరని ఆయన తెలిపారు.













