ఆస్ట్రేలియాకు ఫేస్బుక్ షాక్
ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ షాకిచ్చింది. ఫేస్బుక్ సంస్థకు మీడియా ప్రకటనల ద్వారా వచ్చే రెవెన్యూలో (ఆదాయం) చెల్లించాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయాన్ని ఫేస్బుక్ తిరస్కరించింది. అయితే, మీడియా ద్వారా సేకరిస్తున్న సమాచారం వల్ల తమకు వాణిజ్య పరంగా ఎలాంటి ఉపయోగం లేదని, కావాలంటే మీడియా సమాచారాన్ని ఫేస్బుక్ ఫ్లాట్ఫార్మ్లో ఉపయోగించమని సంస్థ తెలిపింది. అయితే గూగుల్, ఫేస్బుక్ లాంటి సంస్థలు మీడియా సమాచారాన్ని ఉపయోగించినందుకు ప్రకటనల ద్వారా వచ్చే లాభాలతో కొంత మీడియాకు చెల్లించే విధంగా కృషి చేయాలని ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ)ను ప్రభుత్వం ఆదేశించింది.













