ఫేస్బుక్ కు భారీ రాబడి
కరోనా మహమ్మారితో పాటు విద్వేష కంటెంట్‌పై విమర్శలు వెల్లువెత్తినా పలు ప్రతికూలతల మధ్య సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ రెండో త్రైమాసంలో భారీ రాబడిని ఆర్జించింది. ఈ త్రైమాసంలో ఫేస్బుక్ రాబడి ఏకంగా 11 శాతం పెరిగి దాదాపు 1.3 లక్షల కోట్లకు ఎగిసింది. రెండో క్వార్టర్లో 314 కోట్ల మంది ఇన్స్టాగ్రాం, వాట్సాప్, మెసెంజర్ వంటి ఎఫ్బీ యాప్స్‌ను ఉపయోగించనున్నారు. డైలీ యాక్టివ్ యూజర్లు 12 శాతం పెరిగి 179 కోట్లకు చేరారు. అన్ని కంపెనీల తరహాలోనే తమ వ్యాపారం కూడా కోవిడ్ 19 తో ప్రభావితమైందని రాబోయే రోజుల్లో తమ వాణిజ్య పరిస్థితిపై అనిశ్చితి నెలకొందని ఫేస్బుక్ ఓ ప్రకటనలో పేర్కొంది.













