నకిలీ ఖాతాలపై ఫేస్బుక్ వేటు
అసత్య సమాచార వ్యాప్తిని నివారించి, నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ మరో ముందగుడు వేసింది. ఈ మేరకు ఏడాదిలో దాదాపు 540 కోట్ల నకిలీ ఖాతాలను రద్దు చేసినట్టు పేర్కొంది. నకిలీ ఖాతాలను సష్టించడానికి చేసే ప్రయత్నాలను కూడా తిప్పికొట్టేలా సాప్ట్వేర్ను మెరుగుపర్చుకున్నట్టు పారదర్శక నివేదిక సృష్టం చేసింది. వినియోగదారులను మభ్య పెట్టే ఖాతాలను అరికట్టడం సహా రాజకీయ, సామాజిక అజెండాలతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని అరికట్టడానికి ఫేస్ బుక్ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నది. నకిలీ ఖాతాలను నిలువరించడంలో ప్రగతి సాధించినందుకు సంతృప్తిగా ఉందనీ, ఇంకా సాంకేతి పరిజ్ఞానం అభివృద్ధి సాధించాలని తెలిపింది. ఫేస్బుక్లో కచ్చితత్వాన్ని మరింత పెంపొందించడం, సంఘ వ్యతిరేకంగా సమాచార వ్యాప్తి చేస్తున్న ఖాతాలను ఆరికట్టడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని ఫేస్ బుక్ వెల్లడించింది.













