మాకు రాజకీయ పార్టీతో సంబంధం లేదు : ఫేస్బుక్
అధికార పార్టీ బీజేపీకి చెందిన నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలు, అభ్యంతరకరమైన పోస్టులను సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ చూసీచూడనట్లు వదిలేస్తోందంటూ వచ్చిన ఆరోపణలపై ఆ సంస్థ స్పందించింది. సదరు వ్యక్తుల రాజకీయ పార్టీ, స్థాయితో సంబంధం లేకుండా సంస్థ తన విధానాలను అమలు చేస్తోందని సృష్టం చేసింది. హింసను ప్రేరేపించే విద్వేషపూరిత ప్రసంగాలు, అభ్యంతరకర పోస్టులను మేం నిషేధించాం. సదరు వ్యక్తుల రాజకీయ పార్టీ, స్థాయిని పరిగణనలోకి సంస్థ విధానాలను అమలు చేస్తున్నాం. ఈ విషయంలో మేం ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉందని తెలుసు. అలాగే మా విధానాల అమలులో పురోగతి సాధిస్తున్నాం. ఇంకా కచ్చితత్వం కోసం తరచుగా ఆడిట్లు నిర్వహిస్తున్నాం అని ఫేస్బుక్ ప్రతినిధి వెల్లడించారు.
ఫేస్బుక్ హేట్-స్పీచ్ రూల్స్ కొల్లాయిడ్ విత్ ఇండియన్ పాలిటిక్స్ శీర్షిక ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనంతో భారత్తో రాజకీయ వివాదానికి దారితీసింది. దీని ఆధారంగా రాహుల్ గాంధీ బీజేపీ పై విమర్శలలకు దిగారు. అయితే, ఆ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. ఈ క్రమంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథదూర్, ఫేస్బుక్ నుంచి వివరణ కోరారు.













