ఫేస్బుక్ ఓ శుభవార్త
మీరు మీ ఫోన్లో ప్రతిరోజూ ఫేస్బుక్ ఎక్కువగా వాడుతారా? అయితే మీలాంటి వాళ్లకోసమే ఫేస్బుక్ ఓ శుభవార్త అందించింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని రకాల ఫోన్లలో డార్క్‌మోడ్ ఆప్షన్‌ను తీసుకొచ్చినట్లు ఆ సోషల్ మీడియా ప్లాట్‌పాం ప్రకటించింది. త్వరలో తమ వినియోగదారులందరూ ఈ అప్షన్ పొందేలా కసరత్తు చేస్తున్నట్లు చెప్పింది. అయితే, ఎప్పటిలోగా తెస్తామనేది సృష్టంగా పేర్కొనలేదు. ఇప్పటికే ఫేస్బుక్, దీనిని డెస్క్‌టాప్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
మొబైల్లో కాంతిని తగ్గించి, వినియోగదారులకు తక్కువకాంతి పరిస్థితులు కల్పించేందుకు ఈ డార్క్‌మోడ్ ఆప్షన్ ఉపయోగపడుతుందని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనివల్ల బ్యాటరీ లైఫ్‌కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. విండోను బ్లాక్మోడ్లో పెట్టుకోవచ్చని, దీంతో కళ్లు అలసిపోకుండా ఉండడంతో కొందరు పోస్ట్‌లను సృష్టంగా చదువుకోగలరని తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇన్స్టాగ్రాం, వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్లో ఈ డార్క్ మోడ్ ఆప్షన్ ఉంది. అలాగే, ట్విట్టర్ కూడా ఐఓఎస్, ఆండ్రాయిడ్లలో కొంతసేపటి వరకు నైట్మోడ్ వర్షన్‌ను కలిగి ఉంది. గూగుల్ కూడా ఈ ఏడాదిలోనే తన యాప్‌లలో డార్క్‌మోడ్ వర్షన్‌ను తీసుకొచ్చింది.













