డొనాల్డ్ ట్రంప్ పోస్టులను ప్రశ్నించిన ఉద్యోగి తొలగింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెలలో రెచ్చగొట్టే విధంగా చేసిన పోస్టులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించిన ఉద్యోగిని ఫేస్బుక్ సంస్థ విధుల నుంచి తొలగించింది. ట్రంప్ పోస్టులపై చర్యలు తీసుకోకూడదని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ తీసుకున్న నిర్ణయాన్ని సదరు ఉద్యోగి విమర్శించాడు. సియాటెల్‌లో యూజర్ ఇంటర్ఫేస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బ్రాందన్ దైల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. తాను ప్రచురిస్తున్న డెవలపర్ పత్రాల్లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్‌మెంట్‌కు మద్దతుగా ఒక స్టేట్మెంట్ను చేర్చేందుకు నిరాకరించిన సహాద్యోగిని బహిరంగంగా దూషించారన్న పేరుతో తనను తొలగించారని పేర్కొన్నారు. ఫేస్బుక్ సంస్థకు చెందిన బాధ్యతాయుతమైన పనిప్రవేశ నిబంధలను తాను ఉల్లంఘించానని అనుకోవడం లేదని అన్నారు. నన్ను అన్యాయంగా తొలగించారని అనుకోవడం లేదు. నేనే సంస్థతో విసుగు చేందాను అని పోస్టు ద్వారా చెప్పారు.













