ఫేస్బుక్ ఉద్యోగులకు వచ్చే జూలై వరకు వర్క్ ఫ్రం హోం
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఉద్యోగులు ఇప్పట్లో ఆఫీస్కు రానవసరం లేదని, వచ్చే ఏడాది జూన్ వరకు ఇంటివద్ద నుంచే పనిచేసుకోవచ్చని ప్రకటించింది. అంతేకాదు ఆఫీస్ అవసరాలకోసం వెయ్యి డాలర్లు ఇస్తామని కూడా వెల్లడించింది. కరోనా నేపథ్యంలో వైద్య నిపుణులు, ప్రభుత్వాల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఫేస్బుక్ అధికారులు వెల్లడించారు. 2021, జూలై వరకు ఇంటి నుంచే పనీ చేసుకోవచ్చని, ఇంట్లో ఆఫీస్ అవసరాల నిమిత్తం రూ.74,983(వెయ్యి డాలర్లు) చెల్లిస్తామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో ఉద్యోగులతో పలుచోట్ల ఆఫీసులను నడిపిస్తున్నామని వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో అమెరికా, లాటిన్ అమెరికాలోని కార్యాలయాలను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదని చెప్పారు.













