అమెరికా కాంగ్రెస్ ముందుకు రాబోతున్న జుకర్ బర్గ్ !
ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అమెరికా కాంగ్రెస్ ముందుకు రాబోతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్‌పై స్పందించేందుకు ఆయన ఆమెరికా చట్ట సభ్యుల ముందుకు వస్తున్నారు. 2016 అమెరికా ఎన్నికలకు ముందుకు 8,7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికాతో పంచుకున్నామని ఒప్పుకున్న జుకర్‌బర్గ్, కాంగ్రెస్ సభ్యుల నుంచి కఠిన ప్రశ్నలనే ఎదుర్కోబోతున్నారు. సెనేట్ జ్యుడిషియరీ, కామర్స్ కమిటీలు జుకర్‌బర్గ్‌ను మంగళవారం ప్రశ్నించనుండగా, హౌజ్ ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీ బుధవారం ఆయన్ని ప్రశ్నించనుంది. భవిష్యత్తు ప్రణాళికలపై జుకర్‌బర్గ్ నుంచి వాగ్దానాలు తీసుకోవడానికి కూడా అమెరికా చట్టసభ్యులకు ఇది ఓ అవకాశంగా మారుతోంది. వినియోగదారుల గోప్యతను, ఎన్నికల సమగ్రతను కాపాడటం కోసం కొత్త నిబంధనలను రూపొందించడానికి కూడా చట్టసభ్యులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. అయితే కాంగ్రెస్ సభ్యులకు నాలుగు విషయాల్లో ఫేస్బుక్ సీఈవో తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సి ఉందని తెలుస్తోంది.













