సెంటీ బిలియనీర్స్ క్లబ్లో జుకర్‌బర్గ్
ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మొదటిసారిగా సెంటీ బిలియనీర్స్ క్లబ్లో చేరారు. అమెరికా స్టాక్ మార్కెట్లలో ఫేస్బుక్ షేర్లు భారీగా లాభపడటంతో జుకర్‌బర్గ్ సంపద 100 బిలియన్ డాలర్లు దాటింది. దీంతో ఇప్పటికే సెంటీ బిలియనీర్స్ జాబితాలో ఉన్న జెఫ్ బెజోస్, బిల్‌గేట్స్ సరసన జుకర్‌బర్గ్ చేశారు. ఫేస్బుక్లో ఉన్న 13 శాతం వాటా ద్వారానే మార్క్ జుకర్‌బర్గ్ సంపద అధికంగా పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొన్నది. టిక్ టాక్‌కు పోటీగా ఫేస్బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పటికే భారత్‌లో నిషేధానికి గురైన టిక్‌టాక్‌పై తాజాగా అమెరికా కూడా నిషేధం విధించింది. ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌కు ఉన్న మార్కెట్‌ను రీల్స్ దక్కించుకోగలుగుతుందనే అంచనాలతో ఫేస్బుక్ షేర్లకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఫలితంగా మార్క్ జుకర్‌బర్గ్ సంపద కూడా అమాంతం పెరిగిపోయింది.













