ఫేస్బుక్ కు ఇప్పుడు మరో సమస్య
కేంబ్రిడ్జ్ అనలిటికా ఉదంతంతో డేటా చైర్యం వంటి వివాదాల్లో చిక్కుకున్న ఫేస్బుక్ ఇప్పుడు మరో సమస్యలను ఎదుర్కొంటోంది. తన సోదర సంస్థ ఇన్స్టాగ్రామ్ యూజర్లపై వారి మొబైల్‌ఫోన్ కెమెరాల ద్వారా ఫేస్బుక్ నిఘా పెట్టిందంటూ అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. బ్రిటనీ కోండిటీ అనే వ్యక్తి ఈ కేసు వేశారు. ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఆ యాప్‌ను వాడుకున్నా.. వారి ఫోన్ కెమెరాల ద్వారా బయో మెట్రిక్ డేటా తస్కరణకు గురవుతోందని బ్రిటనీ ఆరోపించారు. ఐఫోన్లు కూడా అందుకు అతీతం కాదని కోర్టుకు తెలిపారు. కాగా ఇన్స్టాగ్రామ్ యూజర్లపై ఫేస్బుక్ నిఘా పెట్టిందనే వార్తలు జులైలో కూడా రావడం గమనార్హం.













