చైనాలో అమెరికా ఎంబసీ వద్ద పేలుడు
చైనా రాజధాని బీజింగ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద బాంబు పేలుడు సంభవించింది. గురువారం ఉదయం ఎంబసీ సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ పేలుడుకు పాల్పడింది చైనాకు చెందిన 26 ఏళ్ల వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.00 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇన్నర్ మంగోలియా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అమెరికా రాయబార కార్యాలయం ఎదుట బాంబు దాడికి యత్నించారు. అయితే అది అతడి చేతిలోనే పేలిపోయింది. బాంబు తీవ్రత తక్కువగా ఉండటంతో నిందితుడు మినహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చైనా పోలీసులు తెలిపారు. నిందితుడి పూర్తి వివరాలను దాడికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు.













