స్మార్ట్ఫోన్తో మానసిక అనారోగ్యం?
పొద్దున లేచింది మొదలు, రాత్రి బాగా పొద్దుపోయేదాకా చేతిలో స్మార్ట్ఫోన్ ఉండాల్సిందే. ప్రయోజనాల మాటెల ఉన్నా మితిమీరిన వాడకంతో స్మార్ట్ఫోన్ మానసిక ఆరోగ్యానికి చేటుగా మారొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అరచేతిలో ఇమిడిపోయే ఈ బుల్లి పరికరం ప్రపంచాన్ని మనం ముందుకు తెస్తుందనే విషయం ఎంత నిజమో, అదేపనిగా వాడుతుంటే ఏకాగ్రతను దెబ్బతింటుందనేది అంతే నిజమని చెప్పారు. స్మార్ట్ఫోన్తో పాటు ట్యాబ్, ల్యాప్టాప్, ఐపాడ్, తదితర వస్తువుల వాడకంతోనూ ఈ ముప్పు పొంచి ఉందని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ అధ్యయనంలో భాగంగా 11 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న 151 మంది యువతీయువకులను ఎంపిక చేశారు. శాస్త్రవేత్తల పరిశీలనలో వారు సగటున రోజుకు 2.30 గంటలు టెక్నాలజీ వినియోగంలో మునిగిపోతున్నారని తేలింది. ఇక రోజువారీ వాడకాన్ని దాటి ఎక్కువసేపు స్మార్ట్ఫోన్తో గడిపిన రోజులలో వారి ఏకాగ్రత్త శక్తి తగ్గిపోతుందని, గట్టిగా ప్రయత్నించినా ధ్యాస నిలప లేకపోతున్నారని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక ఎంత సేపూ ఆన్లైన్లో గడిపే యువతలో ప్రవర్తానాపరమైన లోపాలు బయటపడ్డాయన్నారు. వారిలో స్వీయ నియంత్రణ శక్తి తగ్గిపోతుందని చెప్పారు.













