వాషింగ్టన్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ …
కరోనా వైరస్ గుప్పిట్లో అమెరికా విలవిల్లాడుతూనే ఉంది. అమెరికాలో మరణాల సం•్య 9కి పెరిగింది. ఇవన్నీ కాలిఫోర్నియా, వాషింగ్టన్ రాష్ట్రాలోనే సంభవించాయి. వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 126కు పెరిగింది. వాషింగ్టన్తో పాటు శాన్ఫ్రాన్సిస్కో, సియాటిల్ల్లో ఆర్యోగ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఏదైనా ఎదుర్కోగలమనీ ధీమా ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రభుత్వం ఇప్పుడు ఫేస్ మాస్క్లు కూడా సరఫరా చేయలేని స్థితిలో ఉంది. మాస్క్లు, శానిటైజర్లు దొరక్క జనం నానా అవస్థలూ పడుతున్నారు. ఐరోపా దేశాలు, దక్షిణ కొరియా రోజూ వేలాది మందికి పరీక్షలు జరుపుతూంటే అభివృద్ధి చెందిన దేశమైన అమెరికా 3600 మందికి మాత్రమే పరీక్షలు చేయగలుగుతోంది.













