Dallas: డల్లాస్లో ఈద్ మిలాప్ – ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి డా. చంద్ర శేఖర్ పెమ్మసాని
డల్లాస్ నగరంలో ముస్లిం సోదరులకు ఐక్యత, శాంతి, మానవతా విలువలను విస్తృతంగా చాటిచెప్పే విధంగా ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరై ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.
గత శనివారం ఏప్రిల్ 12 న స్థానిక ఇర్వింగ్ లోని విమల్ banquet హాల్ లో, అమాన ఉపాధ్యక్షులు నసీం షేక్ తన స్నేహితులు, బంధువులు,స్థానిక ప్రముఖులతో కలిసి నిర్వహించారు. ఉత్తర అమెరికాలోని ఆంధ్ర ముస్లింల సంఘం (AMANA) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు సుమారు 200 మందికి పైగా ముస్లిం, హిందూ, క్రిస్టియన్ సమాజాల ప్రముఖులు, కుటుంబ సభ్యులు, యువత హాజరై ఈద్ ఆనందాలను పంచుకున్నారు.
నిర్వాహకులు అందరికీ స్వాగతం పలికిన సందర్భంగా నసీం షేక్ గారు మాట్లాడుతూ, AMANA Global Foundation సంస్థ – ఆంధ్ర ప్రదేశ్ ముస్లిమ్స్ అఫ్ నార్త్ అమెరికా ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ అని, అమెరికా లో స్థిర పడ్డ ఆంధ్ర ప్రాంత ముస్లిం కుంటుంబాల ను ఒక చోటికి చేర్చి తమ వంతుగా ఆంధ్ర ప్రదేశ్ లో సేవా కార్యక్రమాలను చెయ్యడం కోసం స్థాపించిన సంస్థ అని తెలిపారు.
AMANA Eid Milap కార్యక్రమానికి కేంద్ర మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని హాజరు కావడం ఒక ప్రత్యేకత అని తెలియచేసారు. డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ వ్యక్తిగత జీవితం, రాజకీయ రంగ ప్రవేశం – అమెరికా లో ఉన్న ప్రతి వ్యక్తి కి స్ఫూర్తిదాయకం అని, వ్యక్తిగత జీవితం లో వ్యాపారవేత్త గా వెలుగొంది, అత్యంత విలాసవంతమైన అమెరికా జీవితాన్ని పక్కకు పెట్టి, ప్రజా సేవ కోసం రాజకీయాల్లో కి ప్రవేశించారని, గుంటూరు పార్లమెంటు సభ్యులుగా అత్యంత మెజారితో గెలిచి, గెలిచినా మొదటి సారె, కేంద్ర మంత్రి గా బాధ్యతలు తీసుకుని అత్యంత క్షమత కలిగిన, విశ్వసనీయమైన నాయకుడు గా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. డాక్టర్ చంద్రగారి లాంటి నాయకులు మన సమాజాన్ని ముందుకు నడిపించగలిగే శక్తివంతమైన మార్గదర్శకులు. అభివృద్ధి ఆధారిత, ప్రగతిశీల రాజకీయాలు ఎలా ఉండాలో ఆయన చూపిస్తున్నారు. ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టి, అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి చేస్తున్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిధి గా హాజరు అయినా కేంద్ర మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని గారు మాట్లాతుతూ ఈద్-ఉల్-ఫిత్ర్ మరియు రమజాన్ పరమార్ధాన్ని ఎంతో గొప్పగా వివరించారు. ‘‘రమజాన్ అనేది ఖాళీ కడుపు గురించి కాదని, అది మనం పేగు నింపుకోక పోయినా – ఆకలిని, బాధను, అవసరాన్ని అనుభవించే అవకాశం, మానవతను స్మరించుకునే అవకాశం’’ అని తెలిపారు. ఇది మనలో ఇతరుల పట్ల కరుణ, దయ, సహనం పెంపొందించే సమయం అని పేర్కొన్నారు. ముఖ్యంగా తాను గుంటూరు నియోజక వర్గం లో ఉన్న ముస్లిముల సమస్యలను అర్ధం చేసుకుని వాటిని పరిష్కారించ దానికి కృషి చేస్తున్నానని తెలియచేసారు. ముస్లిం వర్గాలను ముందుకు తీసుకు రావడానికి, కేంద్ర ప్రభుత్వ పథకాల తో వారికి మేలు చెయ్యడానికి తానూ ప్రత్యేకం గా కృషి చేస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమం లో – నసీం షేక్ తో పాటు, షాజహాన్ షేక్, రియాజుద్దీన్ షేక్, అబ్దుల్ మాజిద్, జమీరుద్దీన్ మొహమ్మద్, ముజాహిద్ షేక్, సిద్దిఖ్, ముస్తఫా, ఇస్మాయిల్ పెనుకొండ, జాకీర్, నవీదుద్దిన్, ఇంతియాజ్, బాల చెరుకూరి, భాను ప్రకాష్, పవన్ బెల్లం, విజయ్ బొర్రా, రామ్ గుళ్ళపల్లి మరియు ఇతరులు పాల్గొన్నారు.








