Damu Gadela: దాము గేదెల కు ఎడిసన్ సిటీ అవార్డ్..
న్యూ జెర్సీ నివాసి, దాదాపు 40 సంవత్సరాల నుంచి కమ్యూనిటీ సేవలో అందరికీ తెలిసిన శ్రీ దాము గేదెల (Damu Gadela) కు ఎడిసన్ సిటీ (Edison City) మేయర్ సామ్ జోషి కమ్యూనిటీ సర్వీసు అవార్డ్ ప్రకటించి ప్రోక్లమేషన్ అందించారు..
ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో కత్తులకవిటి అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన శ్రీ దాము ఆంధ్రా యూనివర్సిటీ లో కంప్యూటర్స్ లో B.S చేసి, అమెరికా లో లాసల్లే యూనివర్సిటీ లో M.S చేసి గత 40 ఏళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ, ఈస్ట్ కోస్ట్ నగరాలలో అనేక తెలుగు సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు, సంస్కృతిక సంస్థల అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ అందరికీ ఆప్తులు గా నిలిచారు.
దాము గేదెల ఇండియా లో కూడా తాను పుట్టి పెరిగిన శ్రీకాకుళం జిల్లాలో, గ్రామం లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జన్మ భూమి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ హై స్కూల్ నిర్మించారు.
శ్రీ దాము ఇప్పటికే అనేక సంస్థలు TANA, ATA, NATS, NATS, APTA, TAGDV, TFAS, TLCA ఇంకా మరెన్నో సంస్థల నుంచి అవార్డ్స్, అప్ప్రెసిసెషన్ లు అందుకొన్నారు. తెలుగు కళా సమితి (TFAS) కి అధ్యక్షుడిగా, 40 వ వార్షికోత్సవ వేడుకలకు చైర్మన్ గా ఎన్నో సేవలు చేశారు. ప్రస్తుతం శ్రీ సాయి దత్త పీఠం లో డైరెక్టర్ గా తన సేవలు అందిస్తున్నారు.
40 సంవత్సరాలు గా శ్రీ దాము చేస్తున్న సేవలను గుర్తించిన ఎడిసన్ సిటీ మేయర్ శ్రీ సామ్ జోషి సిటీ అవార్డ్ ను ప్రకటించారు. సాయి దత్త పీఠం లో శ్రీ రామ నవమి పండుగ సందర్భాన మేయర్ సామ్ జోషి చేతుల మీదుగా తీసుకొన వలనిసిన ఈ అవార్డ్ ఉదయం సీతారామ కళ్యాణం వలన సాయంత్రానికి మారడం, వేరే కార్యక్రమాల వలన మేయర్ రాలేక పోవడం జరిగింది.
సాయత్రం జరిగిన ఈ వేడుకలో ముందుగా సాయి దత్త పీఠం పండితులు శ్రీమతి & శ్రీ దాము గేదెల దంపతులకు వేద ఆశీర్వచనం చేసారు. మన అమెరికా తెలుగు అసోసియేషన్ (MATA) అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గనగోని, తెలుగు కళా సమితి (TFAS) అధ్యక్షులు శ్రీ మధు అన్న, ఇతర కార్యవర్గ సభ్యులు, సాయి దత్త పీఠం అధ్యక్షులు శ్రీ రఘు శంకరమంచి, తెలుగు టైమ్స్ ఎడిటర్ శ్రీ సుబ్బారావ్ చెన్నూరీ మరియు ఇతర అతిథులు పాల్గొని శ్రీ దాము తో తమకున్న అనుభవాలను పంచుకొని దాము గేదెల సేవలను గుర్తు చేసుకొన్నారు.
సాయి దత్త పీఠం మేనేజ్మెంట్ లో భాగం లో గుడి నిర్వహణ, గుడి అభివృద్ధి లో తాను ఒక భాగం అవటం ఒక అదృష్టమని శ్రీ దాము అన్నారు. ఇన్ని సంవత్సరాలు గా నివసిస్తున్న ఎడిసన్ సిటీ నుంచి తనను గుర్తిస్తూ Proclamation రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.







