ఈజీ-5 వీసా మరింత ప్రియం
అమెరికా దేశానికి వలస రావాలనుకొంటున్న భారతీయులు పొందే ఈబీ-5 వీసాలు మరింత ప్రియం కానున్నాయి. అమెరికా గ్రీన్‌కార్డ్ పొందడానికి ఈ వీసాను ఒక రాజమార్గంగా భావిస్తుంటారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈబీ-5 వీసా పొందేందుకు భారతీయులు 5 శాతం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దీని కింద పెట్టుబడి మొత్తాన్ని పెంచినట్టు అమెరికా గత నవంబర్ నెలలోనే ప్రకటించింది.
అమెరికా లీగల్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ ఈబీ-5 ఇన్వెస్మెంట్ వీసా పోగ్రాంలో పెట్టుబడి మొత్తాన్ని గత ఏడాది 9 లక్షల డాలర్లకు(దాదాపు రూ.6.50 కోట్లు) పెంచింది. 1990 తర్వాత పెంచడం ఇదే తొలిసారి. మరోవైపు భారత్‌లో రెమిటన్స్పై 5 శాతం అదనపు పన్ను పడనుండటంతో భారతీయులు మరో 50 వేల డాలర్ల వరకు (దాదాపు రూ.36.08 లక్షలు)చెల్లించాల్సి ఉంటుంది.
వ్యాపారవేత్తల వీసాగా భావించే ఈ వీసాకు దరఖాస్తు చేసే సమయంలో అమెరికాలో పెట్టే పెట్టుబడి మొత్తాన్ని వివరించాల్సి ఉంటుంది. ఇలాంటి పోగ్రాంను సాధారణంగా స్టార్టప్ సంస్థలు వినియోగించుకొని అమెరికన్ మార్కెట్లో తమ వ్యాపారాన్ని విస్తరించుకొంటాయి.













