డొనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్ పోస్టుపై జుకర్ బర్గ్ కు సెగ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్లో పెట్టిన వివాదాస్పద పోస్ట్‌పై ఫేస్బుక్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆ కంపెనీ ఉద్యోగుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో దోచుకోవడం ప్రారంభం అయితే షూటింగ్ ప్రారంభం అవుతుంది అని మే 28న ఫేస్బుక్లో ట్రంప్ పోస్ట్ చేశారు. దీనిపై ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌పై కంపెనీ ఉద్యోగులు ప్రశ్నల వర్షం కురిపించారు. ట్రంప్ చేసిన పోస్ట్ ఫేస్బుక్ విధానాలను ఉల్లంఘించేలా ఉందని జుకర్‌బర్గ్‌తో జరిగిన వీసీ భేటీలో మండిపడ్డారు.













