మధుమేహ బాధితులకు శుభవార్త!
మధుమేహ బాధితులకు శుభవార్త. రోజువారీగా తీసుకునే సూదిమందుల నుంచి విముక్తి. ఒకసారి చికిత్స తీసుకోవడం ద్వారా నెలంతా మందుల గొడవ లేకుండా హాయిగా జీవించే కాలం రానుంది. ఈ దిశగా శాస్త్రవేత్తలు ఓ వినూత్న చికిత్సను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం మధుమేహానికి అందుబాటులో ఉన్న చికిత్సలకన్నా ఇది ఎంతో మెరుగైందని చెప్పారు. ఈ శాస్త్రవేత్తల బృందంతో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త అశుతోష్ చిల్కోటి కూడా ఉండడం విశేషం. టైప్-2 మధుమేహ బాధితుల కోసం ఈ చికిత్సను అభివృద్ధి చేశారు. దీనిని మందు ప్రభావం ఎక్కువ కాలం ఉండేలా తీర్చిదిద్దినట్లు డ్యూక్ యూనివర్సిటీ చెందిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. జంతువులపై జరిపిన ప్రయోగంలో ఈ చికిత్స ద్వారా గ్లూకోజ్ నియంత్రణ సమయం మూడు రెట్లు పెరిగిందని గుర్తించింది.













