అరటిపండు 85 లక్షలకు అమ్ముడు పోయింది…
అమెరికాలో ఓ అరటిపండును ఆక్షన్‌లో పెట్టగా.. ఊహించని విధంగా రూ.85 లక్షలకు అమ్ముడుపోయింది. రూపాయలు విలువ చేసే అరటిపండు లక్షల్లో అమ్ముడవ్వడం ఏంటని చూస్తున్నారా? వివరంగా చెప్పాలంటే.. మారిజియో కాటెలన్ అనే ఇటాలియన్ కళాకారుడు పైనున్న ఫొటోలో ఉన్న.. కమెడియన్‌గా పిలిచే ఈ అరటిపండు టేపుతో ఆర్ట్ గ్యాలరీలో గోడకు అతికించాడు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఆర్ట్ బసెల్ పేరుతో ప్యారిస్‌కు చెందిన పెర్రొటిన్ ఆర్ట్ గ్యాలరీ ఫౌండేషన్ దీన్ని మియామి బీచ్‌లో ప్రదర్శనకు పెట్టింది. మియామి ప్రాంతంలోని ఓదుకాణంలో కొన్న అరటిపండు ప్రదర్శనకు పెడితే.. లక్షా 20 వేల డాలర్ల (రూ.85.55 లక్షలు)కు అమ్ముడుపోవడం అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. పైగా ఈ ఆర్ట్ వర్క్‌ను ప్రదర్శనకు పెట్టిన ఆర్ట్ గ్యాలరీ.. ఈ పీస్‌కు ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను కూడా జారీ చేయనున్నట్టు తెలిపింది.













