యుఎస్ లో దేవిశ్రీ ప్రసాద్ ప్రదర్శనలు
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో దుమ్మురేపే పాటలకు కేరాఫ్ అడ్రస్ డీఎస్పీ.. దేవిశ్రీ ప్రసాద్. వెండితెరపైనే కాదు, లైవ్ షోలలోనూ అదరగొట్టే దేవిశ్రీ ప్రసాద్ యూఎస్ఏలో వరుస ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అమెరికా టూర్ ఆగస్టు 11వ తేదీ నుంచి సెప్టెంబరు 16వ తేదీ వరకూ జరగనున్నది. ఆగస్టు 11న సియాటెల్(సాయంత్రం 6.00గం.), ఆగస్టు 18న చికాగో(సాయంత్రం 6.00గం.), ఆగస్టు 25న డెట్రాయిట్(సాయంత్రం 6.00గం.), సెప్టెంబరు 1న డల్లాస్((సాయంత్రం 6.00గం.), సెప్టెంబరు 8న న్యూజెర్సీ(సాయంత్రం 5.00గం.), సెప్టెంబరు 16న శాన్‌జోస్ (సాయంత్రం 5.00గం.)లలో దేవిశ్రీ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి మధుశాలిని వ్యాఖ్యాతగా వ్యవహరించనుండగా, దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి సాగర్, శ్రద్ధాదాస్, హేమచంద్ర, శ్రావణ భార్గవి, రనీనారెడ్డిలు సినిమా పాటలతో అలరించనున్నారు.













