అమెరికాలో రెడ్డీస్ ఔషధం రీలాంచ్
అమెరికా మార్కెట్లో జెనటేన్ క్యాప్సూల్స్‌ను పున ప్రవేశపెట్టినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రకటించింది. 10, 20, 30, 40 ఎంజీ మోతాదుల్లో లాంచ్ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. హాఫ్మన్ లారోచే కు చెందిన ఆక్యుటేన్ క్యాప్సూల్స్‌కు ఇది జనరిక్ వెర్షన్. ఐక్యూవీఐఏ హెల్త్ డేటా ప్రకారం గడిచిన 12 నెలల్లో అమెరికా మార్కెట్లో జెనటేన్ క్యాప్సూల్స్ (10,20,30,40 ఎంజీ)తో పాటు ఇతర జనరిక్ల విక్రయాలు 52.5 కోట్ల డాలర్ల స్థాయిలో ఉంటాయని అంచనా. బీఎస్ఈలో ట్రేడింగ్ ముగిసేసరికి డాక్టర్ రెడ్డీస్ షేర్లు 1.54 శాతం పెరిగి రూ.2,718.90 వద్దకు చేరుకున్నాయి.













