అమెరికాలో డాక్టర్ రెడ్డీస్ కు చుక్కెదురు
ఫార్మా కంపెనీ ఎలి లిల్లీతో ఏర్పడిన పేటెంటు కేసులో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఓటమి పాలైంది. క్యాన్సర్ చికిత్సలో వాడే ఎలీ లిల్లీ తయారీ అలిమ్టా (పెమెట్రెక్స్డ్) ఔషధం విషయంలో ఇరు సంస్థల మధ్య పేటెంటు వివాదం తలెత్తింది. రెడ్డీస్ విడుదల చేయనున్న ప్రతిపాదిత పెమెట్రెక్స్డ్ ప్రత్యామ్నాయ ఉత్పాదన పేటెంటు ఉల్లంఘన కిందకు వస్తుందంటూ యూఎస్‌లోని ఇండియానా డిస్ట్రిక్ట్ కోర్టు ఎలీ లిల్లీకి అనుకూలంగా తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు ప్రకారం 2022 మే నెల లోపు రెడ్డీస్ తన ఉత్పాదనను యూఎస్ మార్కెట్ చేయడానికి వీలులేదు.













