అమెరికా మార్కెట్లోకి మరో కొత్త జనరిక్ జౌషధం
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ అమెరికా మార్కెట్లోకి మరో కొత్త జనరిక్ ఔషధాన్ని విడుదల చేసింది. క్లోర్తాలిడన్ పేరుతో విడుదల చేసిన ఈ టాబ్లెట్లు అధిక రక్తపోటు (బీపీ) చికిత్సలో ఉపయోగపడతాయని కంపెనీ బీఎస్ఈకి తెలిపింది. ఒక కంపెనీ హిగ్రోటన్ బ్రాండ్ పేరుతో ఈ టాబ్లెట్లను ఇప్పటికే అమెరికా మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన 12 నెలల కాలంలో హిగ్రోటన్ బ్రాండ్ టాబ్లెట్ల అమ్మకాలు 12.2 కోట్ల డాలర్ల వరకు ఉన్నాయి. ఈ బ్రాండెడ్ టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా క్లోర్తాలిడన్ పేరుతో జనరిక్ వెర్షన్లో 25 ఎంజీ, 50 ఎంజీ మోతాదులో టాబ్లెట్లను విడుదల చేసినట్టు డాక్టర్ రెడ్డీస్ కంపెనీ పేర్కొంది.













