అమెరికా మార్కెట్లోకి రెడ్డీస్ కొత్త ఔషధం
భారత ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ అమెరికా మార్కెట్లోకి ఆటోమాక్సిటైన్ అనే క్యాప్సూల్స్‌ను విడుదల చేసింది. జనరిక్ వెర్షన్లో విడుదల చేసిన ఈ క్యాప్సూల్‌ను అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీగా పిలిచే ఆరోగ్య సమస్య ట్రీట్మెంట్లో ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఎలి లిల్లీ అండ్ కంపెనీ స్టటెరా బ్రాండ్ పేరుతో ఈ క్యాప్సూల్స్‌ను మార్కెట్ చేస్తోంది. ఈ సంవత్సరం ఆగస్టుతో ముగిసిన 12 నెలల కాలంలో స్టటెరా బ్రాండ్ అమ్మకాలు 30.4 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,250 కోట్లు) వరకు ఉన్నాయి.













