డాక్టర్ రెడ్డీస్ కు అమెరికా షాక్
డాక్టర్ రెడ్డీస్‌కు అమెరికా నియంత్రణ మండలి గట్టి షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో కంపెనీకి ఉన్న ఫార్ములేషన్ యూనిట్‌పై యూఎస్ఎఫ్డీఏ నాలుగు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. యూఎస్ఎఫ్డీఏ ఆడిట్ సభ్యులు శ్రీకాకుళం ప్లాంట్ (సెజ్) యూనిట్-1ను తనిఖీ చేశారని, వారు నాలుగు అభ్యంతరాలపై ఫార్మ్ 483 జారీ చేశారని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. తనిఖీలో లేవనెత్తిన అంశాలను త్వరలో పరిష్కరించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.













