కె.విశ్వనాథ్ కు అక్కినేని అంతర్జాతీయ పురస్కారం
పద్మవిభూషణ్, నటసమ్రాట్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మీద అభిమానంతో అమెరికా అభిమానులు, సన్నిహితుల ఆధ్వర్యంలో 2014లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థలను స్థాపించి ప్రతి ఏటా అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలను అందిస్తున్నారు. అక్కినేని కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం దూరదృష్టి తదితర లక్షణాలను ప్రస్తుత యువతారానికి స్ఫూరిదాయకంగా చేయాలనే ఉద్దేశంతో ఈ పురస్కారాలను అందిస్తున్నారు. గత మూడేళ్లుగా గుడివాడ (2014) హైదరాబాద్ (2015) చెన్నై (2016 లలో నిర్వహించిన ఈ పురస్కార ప్రదానోత్సవం ఈ ఏడాది 4వ సారి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహిస్తున్నామని, జీవిత సౌఫల్య పురస్కారాన్ని దాదాసాహెబ్ పురస్కార గ్రహీత, కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు అందిస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు డా.తోటకూర ప్రసాద్, అధ్యక్షుడు సీ.ఆర్ రావులు ఓ ప్రకటనలో తెలిపారు.













