వారెన్‌బఫెట్ సోదరి ఇకలేరు
ఇన్వెస్టర్లకు గురుగా పిలుచుకునే వారెన్‌బఫెట్ సోదరి డోరిస్ బఫెట్ కన్ను మూశారు. రాక్పోర్ట్ మైన్‌లో ఉన్న తన ఇంటిలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల డోరీ మృతితో ఆమె కుటుంబ విషాదంలో మునిగిపోయింది. ఆమె కుమారుడు అలెగ్జాండర్ బఫెట్ రోజెక్ మాట్లాడుతూ బిల్లీ హాలిడే మ్యూజిక్ వింటూనే కన్నుమూసినట్లు తెలిపారు. ఉదార దాతగా పేరున్న డోరీ తన సోదరుడు వారెన్ బఫెట్‌కు సహాయకారిగా ఉన్నారు. బఫెట్‌కు ప్రజల జీవన శైలిని సైతం మార్చే బహుమానాలు ఇవ్వడం వెనుక డోరీ ప్రమేయం ఉందని ఇప్పటికీ చెపుతారు. వందలాదిగా తన సోదరునికి వచ్చే లేఖలను ఆమె పరిశీలించి కొంతమేర సాయం చేస్తారు. కొందరు వలంటీర్ల గ్రూప్‌ను ఎంపికచేసి అర్హత కలిగిన వారికి ఎంపిక చేసి విరాళాలు ప్రకటిస్తారు. స్వార్థ్యంతో వచ్చే విప్ఞప్తులను తిరస్కరించి మొత్తం విజ్ఞప్తులను క్రోడీకరించి ఎంపిక చేసేవారు.













