డీఏసీఏకు డొనాల్డ్ ట్రంప్ ఎసరు
అమెరికాలోకి ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా చిన్నతనంలోనే వెళ్లి స్థిరపడిన విదేశీయులను వెళ్లగొట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆస్త్రాన్ని ప్రయోగించనున్నారు. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) చట్టాన్ని ట్రంప్ సర్కారు గతంలో రద్దు చేయగా, ఆ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేయనున్నట్టు ట్రంప్ స్వయంగా చెప్పారు. ఒరాక్ ఒబామా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు డీఏసీఏ చట్టాన్ని తెచ్చారు. దీని ప్రకారం సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించిన విదేశీయులతో పాటు వెళ్లిన వారి పిల్లలకు ఆ దేశంలో స్వేచ్ఛగా నివసించేందుకు, ఉద్యోగాలు చేసుకొనేందుకు అవకాశం లభించింది. అలా వెళ్లినవారు ప్రస్తుతం 7 లక్షల మందివరకు ఉంటారు. వీరిలో అత్యధికులు భారతీయులు, ఆసియాదేశాలవారే ఉన్నారు.













