డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలగడమా? లేదా ఆ దేశంపై మరిన్ని ఆంక్షలేమైనా మోపుతారా? అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోనున్నారని వైట్‌హౌస్ వెల్లడించింది. కాగా, అణు ఒప్పందాన్ని అడ్డంపెట్టుకొని ఇరాన్ అణ్వాయుధ సంపత్తిని పెంపొందించుకోవాలని భావిస్తోందని ఈయూ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇరాన్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనకు పలుదేశాలు వత్తాసు పలుకుతున్నాయి. అయితే, అమెరికా హెచ్చరికలను తామే మాత్రం తలొగ్గేది లేదని ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమెరికా తమపై ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు మోపినా వెనక్కి తగ్గబోమని అన్నారు. కాగా, ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని కొనసాగించాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సస్ ట్రంప్‌ను కోరారు. ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతలు కూడా ట్రంప్‌ను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యాయి.













