మళ్లీ ట్రంప్ నోట.. అదే మాట
కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం జరిపేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. కశ్మీర్లో నెలకొన్న విధ్వంసకర పరిస్థితులపై మధ్యవర్తిత్వం జరిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని ట్రంప్ అన్నారు. ఈ అంశాన్ని వారాంతంలో భారత ప్రధాని మోదీ వద్ద ప్రాస్తావించనున్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ చేసిన ఇలాంటి వ్యాఖ్యలు మనదేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ట్రంప్ నోటి వెంట మధ్యవర్తిత్వ మాటలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.













