అమెరికా ఆర్థిక సంక్షోభం నివేదిక వెంటనే అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ట్రంప్ సూచన

అమెరికా అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గురువారం 30 జూలై న అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా వే యవలిసింది గా సూచించారు. గురువారం 30 జూలై ట్విట్టర్ ద్వారా అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మెయిల్-ఇన్ ఓటింగ్ కారణంగా అమెరికా చరిత్రలో 2020 ఎన్నికలు ఉచితముకాని మరియు మోసపూరిత ఎన్నికలుగా మారనున్నాయి అని అందుకే ప్రజలు ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఓటు వేసే వరకు ఎన్నికలు వాయిదా వే యవలిసిందిగా సూచిస్తూ ఇది అమెరికాకు గొప్ప ఇబ్బందిగా ఉంటుంది అని తెలిపారు.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 32.9% వార్షిక రేటుతో కుంచించుకుపోయింది మరియు నిరుద్యోగం 14.7% కి పెరిగింది అని ప్రభుత్వం నివేదించిన కొద్ది నిమిషాలకే అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలు వాయిదా వేయాలి అని సూచిస్తూ ట్వీట్ చేయడంతో డెమొక్రాట్స్ మరియు పలువురు ప్రజా ప్రతినిధులు అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలల్లో వెనుకబడి ఉండటం , అమెరికా కరోనా వైరస్ కారణంగా ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోవడం, నిరుద్యోగం శాతం పెరగడం లాంటి సమస్యల నుంచి ట్రంప్ బయటపడలేక పోతున్నారు
అంతే కాక పలు మీడియా సంస్థలు ప్రజలను ఇంటర్వ్యూ చైయటం ద్వారా సేకరించిన సర్వే సమాచారం ప్రకారం అద్ధ్యక్షులు ట్రంప్ కి గడిచే ఈ మూడు నెలల్లో వెతిరేకత ఇంకా పెరిగే అవకాశం ఉండచ్చు అని తెలిపాయి అందుకే అద్ధ్యక్షులు ట్రంప్ ఎన్నికలను వాయిదా వేయవలసిందిగా సూచించారు అని అభిప్రాయపడినట్టు ది గ్లోబల్ అండ్ మెయిల్ తెలిపింది. ఏది ఏమైనా అమెరికా అధ్యక్షుడు కి ఎన్నికలు వాయిదా వేసే అధికారాలు ఉండవు యు.ఎస్. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సమయాన్ని నిశ్చయించే అధికారం కాంగ్రెస్కు మాత్రమే ఉంటుంది అని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.











































































