భారత్ పర్యటనకు ట్రంప్ ఆసక్తి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారని, అక్కడికి రావాలంటే అందుకు సమయం, ఇతర బాధ్యతలపై ఆధారపడి ఉందని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తగిన సమయంలోనే భారత్‌ను సందర్శించడానికి ఆసక్తి కనబరుస్తున్నారైతే తాను చెప్పగలగని దక్షిణ, మధ్య ఆసియా ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అలైస్ వెల్స్ మీడియా ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. కాగా, వచ్చే ఏడాది జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ ట్రంప్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలకు ట్రంప్ హాజరవుతారా అని ప్రశ్నించగా సమయం, ఇతర బాధ్యతలు పరిగణలోకి తీసుకొని శ్వేతసౌధం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగవుతున్నాయని, అమెరికా, భారత్‌కు చెందిన వివిధ విభాగాల అధికారుల మధ్య ఇప్పటివరకు 40 సార్లు చర్చలు జరిగాయని తెలిపారు.













