ట్రంప్‌పై హిల్లరీ తప్పుడు డోసియర్?
రష్యాతో తనకు సంబంధాలున్నట్లు ఆరోపణలుగల డోసియర్ తయారు చేయడం కోసం పరిశోధనా కార్యక్రమానికి నిధులు ఇచ్చినట్లు డెమోక్రాటిన్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమెను తీవ్రంగా విమర్శించారు. ఆమె తన ప్రచారంలో ఈ పని చేసినట్లు వార్తలు వచ్చాయి. దేశ రాజకీయాలపై చెడు అభిప్రాయాన్ని వ్యాప్తి చేసే ఉదంతం ఇదని ఆయన ఖండించారు. బ్రిటీష్ మాజీ గూఢచారి అధికారి క్రిస్టఫర్ టీలే ఆ డోసియర్‌ను తయారు చేసినట్లు వాషింగ్టన్ పోస్టు ప్రకటించిన తర్వాత అది పెద్ద వివాదం అయింది.













