అమెరికన్లకు ట్రంప్ క్రిస్మస్ కానుక
క్రిస్మస్ బహుమతిగా అమెరికన్ ప్రజలపై భారీగా పన్నుల భారం తగ్గిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. దీని ద్వారా భారీగా ఉద్యోగాలు లభించడంతోపాటు వేతనాలు కూడా పెరుగుతాయని వెల్లడిచారు. ఈ మేరకు అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు పన్నుల బిల్లుకు తుది రూపాన్ని ఇచ్చారు. వచ్చేవారం దీనిపై ఓటింగ్ జరుగున్నది. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా పన్ను సంస్కరణలు, అత్యవసరమని, క్రిస్మస్ బహుమతిగా దేశవాసులపై భారీగా పన్నుల భారాన్ని తగ్గిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ హామీని నెరవేర్చారు. తాజా పన్నుల బిల్లు ఓటింగ్‌కు రానున్న సందర్భంగా శ్వేతసౌధంలో ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇప్పుడు మనం కొన్ని రోజుల దూరంలోనే ఉన్నాం. పన్ను తగ్గింపు హామీని దృష్టిలో ఉంచుకొని అమెరికన్ కుటుంబాలకు అద్భుతమైన విజయాన్ని అందిస్తాం. అమెరికా ప్రజలకు క్రిస్మస్ బహుమతిగా పన్నులో భారీ కోత విధిస్తాం అని అతికొద్ది మంది ఆహ్వానితుల సమక్షంలో వెల్లడించారు.













