డొనాల్డ్ ట్రంప్ యూ టర్న్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్లను సప్లయ్ చేయకపోతే భారత్ పై వాణిజ్యపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు. అంతే కాకుండా మోదీ చాలా మంచోడంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. మోదీ చాలా మంచివాడంటూ పదేపదే చెప్పుకొచ్చారు. ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ టెలిఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నేను 29 మిలియన్లకు పైగా డోస్ లను కొనుగోలు చేశానన్న ట్రంప్ భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ అమెరికా వస్తుంది. నేను మోదీని అడిగాను. మోదీ చాలా గ్రేట్. మోదీ చాలా మంచివాడంటు ట్రంప్ మాట్లాడారు.













