డొనాల్డ్ ట్రంప్ నకు వంట కష్టాలు
అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం తాజాగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పడింది. శ్వేతసౌధంలో అతిథుల కోసం ఆయనే స్వయంగా ఆహారం అర్డర్ ఇవ్వాల్సి వచ్చింది. కళాశాల స్థాయి జాతీయ పుట్‌బాల్ ఛాంపియన్షిప్ విజేత క్లెమ్సన్ టైగర్స్ జట్టును ట్రంప్ విందుకు ఆహ్వానించారు. షట్‌డౌన్ కారణంగా శ్వేతసౌధం వంట మనుషులు ప్రస్తుతం బలవంతపు సెలవుపై ఉన్నారు. దీంతో అతిథుల కోసం మెక్‌డొనాల్డ్స్, వెండీస్ నుంచి ట్రంప్ తన సొంత డబ్బుతో బర్గర్లు, వేపుళ్లు, పిజ్జాలు తెప్పించారు. వాటిని స్వయంగా తానే ఆర్డర్ చేశారు. మెక్సికోతో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి ట్రంప్ 5.7 బిలియన్ డాలర్లు డిమాండ్ చేయడం, కాంగ్రెస్ అందుకు నిరాకరించడం కారణంగా అమెరికా ప్రభుత్వం పాక్షికంగా షట్‌డౌన్ అయిన సంగతి తెలిసిందే. దేశ చరిత్రలోనే సుదీర్ఘంగా ఈ షట్‌డౌన్ నేటికి 26 రోజులకు చేరుకుంది.













