భారత సంతతికి మరో పదవి ఇచ్చిన ట్రంప్
ప్రపంచ బ్యాంకుకు అనుబంధంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్(ఐబీఆర్డీ)కు ఆల్టర్నేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అశోక్ మైఖేల్ పింటో నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. అశోక్ గతంలో మాజీ అధ్యక్షుడు జార్జి.డబ్ల్యూ.బుష్ వద్ద ప్రత్యేక సహాయకుడిగా, అసోసియేట్ కౌన్సిల్‌గా, అమెరికా కాంగ్రెస్ లో చీఫ్ ఇన్వెస్టిగేటివ్ కౌన్సిల్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన అమెరికా కోశాగారంలో విదేశీ వ్యవహారాల విభాగపు కౌన్సెలర్‌గా పనిచేస్తున్నారు. ఆయన స్టాన్‌ఫర్డ్ వర్సిటీ నుంచి బీఏ, యూనివర్సిటీ ఆఫ్ లినోయిస్ నుంచి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పొందారు.
మరో భారతీయ-అమెరికన్ మనీశా సింగ్.. పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవల్‌పమెంట్(ఓఈసీడీ) అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల శాఖ సహాయ కార్యదర్శిగా ఉన్నారు. ఇంతకు ముందు ఆమె ఆర్థిక వ•ద్ధి, విద్యుత్తు, పర్యావరణ, బ్యూరో ఆఫ్ ఎకనామిక్, వ్యాపార వ్యవహారాల విభాగాలు, విదేశీ వ్యవహారాల కమిటీలో కీలక హోదాల్లో సేవలందించారు. ఆమె అమెరికన్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్ఎం, ఫ్లోరిడా వర్సిటీ నుంచి డాక్టరేట్, మియామీ వర్సిటీ నుంచి బీఏ, న్యాయ శాస్త్రాల్లో పట్టాలు పొందారు. నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లైడెన్ నుంచి కూడా ఆమె న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.













